దేశ వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు

రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) ఇవాళ(సోమవారం) తెలిపింది. వాయువ్య మధ్యప్రదేశ్‌లో వర్షాలు తగ్గనున్నాయని చెప్పింది. మరో తుఫాను ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుందని హెచ్చరికలు జారీ చేసింది. జూలై 28న ఏర్పడే అల్ప పీడన ప్రభావంతో పొరుగు ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయని సూచించింది. అల్ప పీడన ప్రభావంతో జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌లలో జూలై 29 వరకు భారీ వర్షపాతం నమోదుకానుందని వాతావరణశాఖ అంచనా వేసింది. 

జూలై 27, 28 తేదీలలో హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, వాయువ్య ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో కూడా విస్తారమైన వర్షపాతం నమోదు కానుందని చెప్పింది. జూలై 29వ తేదీన మహారాష్ట్రలో ఘాట్‌ ప్రాంతమైన కొంకణ్‌ ప్రాంతాలలోనూ, గోవాలోనూ విస్తృతమైన వర్షపాతం కానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.